Monday, February 19, 2018

Telangana Animutyam




'బమ్మెర  పోతన పుట్టిన పోతుగడ్డ  వరంగల్లు జిల్లాలో పుట్టిన ఆణి ముత్యం – పూజ్యులు, పెద్దలు, నిగర్వి , శాంత మూర్తి, అజాత శత్రులు, కథా రచయిత, కవి, పండితులు, గేయ రచయిత, గురువర్యులు శ్రీ కంది శంకరయ్య గారు , విశ్రాంత తెలుగు పండితులు. వీరి భక్తి గీతమునకు స్వర్గీయ చక్రి గారు స్వరకల్పన చేశా రు.  తెలుగు భాష సేవలో అంతర్జాతీయంగా పాటు పడుతున్న వీరు ఈమద్య ముగిసిన అంతర్జాతీయ తెలుగు మహాసభలలో ఈ పండిత శిఖరం , తగిన గుర్తింపు పొందక పోవటం శోచ నీయము. వారు తన కృషిని గురించి చెప్పటానికి కూడా మొఖమాట పడతారు.  
26, జులై 2008, శనివారం నాడు శంకరాభరణం వెబ్ సైటును మొదలు పెట్టారు. 9 సం. ల నుండి నిరాటం కముగా ఈ సైటు నిర్వహించ బడుతుంది.  వామనావతారంతో జనించిన ఈ వెబ్ సైటు నేడు విశ్వవ్యాప్తమై 100 ల మంది కవులను తాయారు జేస్తుంది. ఇప్పటి వరకు ఈ సైటు వీక్షణల  సంఖ్య 17,27,922. నూజువీడు నుండి  న్యుజెర్సి వరకు ఈ వెబ్ సైటు లో పద్యాలూ వ్రాసే కవులున్నారు. వీరు వెబ్ సైటులో / వాట్సు ఆప్ గ్రూపు లో సమస్యా పూరణలు, దత్తపదులు, న్యస్తాక్షరి, నేర్పుతుంటారు. బొమ్మలను చూచి పద్యములను వ్రాయటం, పూర్వకవుల కందపద్యములను వృత్తములుగ వ్రాయటం, పూరవ కవుల పద్యముల నుండి ఒక్క పదం ఇస్తే సొంతగా మిగిలి పదములను పూరించటం వంటి ప్రక్రియలు జరుగుతూ ఉంటాయి.  ఈ బడిలో నవ  యువకుల నుండి 75 సం. లు నిండిన వారుకుడా దీనిలో పద్యములను వ్రాస్తూంటారు. నేడు ఉభయ రాష్ట్రములలో శంకరాభరణం  కవి లేని  పండిత సభ లేదంటే అతిశయోక్తి కాదు. ఆకాశవాణి హైదరాబాదు కేంద్రంలో ప్రతి శనివారం  ప్రకటించ బడుతున్న పూరణలలో 80% శంకరాభరణం కవులనుంచే వస్తున్నాయి. అంతర్జాలంలో ఉన్న ప్రతిసైటులో ఈ కవులే పద్యములను వ్రాస్తుంటారు.  షష్టి పూర్తి తరువాత ఈ సైటు లో చేరి పద్యములను నేర్చుకున్న వారు చాలామంది ఉన్నారు. యువకులు  అష్టావధానులుగా తయారవ్వటానికి కూడా ఈ సైటు ఉపయోగపడుతుంది. మీ విలేఖరిని పంపితే నేను చెప్పింది చాల తక్కువ అర్థమౌతుంది. 

    ఇప్పటి వరకు ఈ సైటులో పూరించిన సమస్యలు: 2587, పద్యరచన : 1237, దత్తపదులు:  134, న్యాస్తాక్షరి : 53. ఇది నిజంగా తెలుగు భాషకు, జాతికి శంకరాభరణ మే.

  తెలుగు భాషాభివృద్ధికై సదా పాటు పడే తెలుగు వెలుగు ఈ రత్నమును గురించి ప్రజలకు తెలియజేయాలని కోరుకుంటున్నాను. అంధ్రప్రదేశ్ ప్రభుత్వమైనా ఈ జాతి రత్నాన్ని భవిష్యత్తు లో జరపబోయే తెలుగు సభలలో సత్కరిస్తే అ మహాను భావునికి తగిన గుర్తింపు కలుగుతుంది.'


...Annapareddy Satyanarayana Reddi


Sunday, February 18, 2018

Three Deities



From Left to Right:

Sree Kota Rajasekhar, Sree Kandi Sankarayya, Sree Mylavarapu Muraleekrishna

@ Vidavaluru, Nellore District, Andhra Pradesh on 16 January, 2018