Monday, June 8, 2015

ఇషాని శతకం 21 - 30

*********************************************************************************************************************************************












21.    కులము ధనము వలన కలుగ బోదు గుణము

  సేతు జలధి గట్టె కోతి మూక

  కొలను బుదర లోన కలువ తామర పూసె

  శ్రధ్ధ బెట్టి వినుము చిన్న ఇషని



22.    కాన రాని వెన్నొ కలవు జగతి లోన

  మనువు తనువు లేవు మన్మధు నకు

  నల్ల మబ్బు దా చు తెల్ల మెరుపు తీగ

  శ్రధ్ధ బెట్టి వినుము చిన్న ఇషని



23.    పాలు కాచి దించ పాల మీగడ కట్టు

  చేయి కాల కొత్త చర్మ మొచ్చు

  కాల మెంత గడువ కష్ట మంతయు తీరు

  శ్రధ్ధ బెట్టి వినుము చి న్న ఇషని



24.    అస్త మించ సూర్యు డంధ కారము కమ్ము

  తెల్ల వారి నంత కలుగు వెలుగు

  విద్య వంట బట్ట బుధ్ధి మాంద్యము తీరు

  శ్రధ్ధ బెట్టి వినుము చిన్న ఇషని



25.    సత్య మెంత యనిన నిత్య మనంతము

  తార లెన్న బోవ నారు వేలు

  దూర దర్శి జూడ తండోప తండాలు

  శ్రధ్ధ బెట్టి వినుము చిన్న ఇషని



26.    ధనము దాచి నంత దారిద్ర్యము తొలగు

  విద్య దాచి నోడు విర్ర వీగు

  కామ ధేను బిదుక కొల్ల కొల్లలు పాలు

  శ్రధ్ధ బెట్టి వినుము చిన్న ఇషని



27.    కంఠ పాఠ మింత కొన్ని విద్యలు నబ్బు

  తరచి తరచి వెదక తెలివి కలుగు

  గాను గెద్దు తిరుగు గంత గట్టి సుడిలొ

  శ్రధ్ధ బెట్టి వినుము చిన్న ఇషని



28.     ఎంత అడిగి నారొ అంతె ఉత్తర మివ్వు

  చేట భారతమ్ము చెరుపు జేయు

  అగ్గి పుల్ల చాలు అంధ కారము తీర్చ

  శ్రధ్ధ బెట్టి వినుము చిన్న ఇషని



29.     కర్పు రమ్ము వెలుగు కన్ను మూసి తెరువ

  రాతి బొగ్గు కాలు రగిలి రగిలి

  సూక్ష్మ బుధ్ధి నేర్ప సుళువాతి సుళువుర

  శ్రధ్ధ బెట్టి వినుము చిన్న ఇషని



30.    తామ రమ్ము విచ్చ తేనె టీగలు వచ్చు

  బొట్టు బెట్టి పిలవ బెట్టు లేక

  భక్తు లెల్ల చేరు భగ వంతుడు వెలువ

  శ్రధ్ధ బెట్టి వినుము చిన్న ఇషని








...Posted by Ishani

***************************************************************************************************************************************

No comments:

Post a Comment