****************************************************************************************************************************************
మానవుని మనస్తత్వం ఒకటి రెండు తరాలలో మారదు. మారేది వారి కాపట్యమే. దీన్నే
కొందరు నాగరికతగా భావిస్తారు.
మాపైతరం - తండ్రులూ తాతలూ పిన్నులూ పెద్దమ్మలూ...- ఇళ్ళల్లో పిల్లలను
ఒకరితోనొకరిని పోల్చి బహిరంగంగా ప్రకటించేవారు...
"వీడు నల్లగా ఉంటాడు వాడు తెల్లగా ఉంటాడు. ఇది మొద్దు అది తెలివిగలది..."..ఇలా ఇలా...
పిల్లలు ఎంత పెద్దవారయినా పెద్దల బుధ్ధులు మారేవి కాదు.
నేను ఉద్యోగంలో చేరిన కొత్తల్లో మా బంధువులొకింటికి వెళ్ళేవాణ్ణి. నన్ను చూడగానే ఆ
మహాతల్లి ఇలా అడిగేది:
"ఏమిరా నీ జీతం ఎంత?"
"500"
"మా వాడిది 600 లే!"
నేను నా జీతం ఎంత పొడిగించి చెప్పినా ఆవిడ వాళ్ళ అబ్బాయిది ఇంకొంచెం
పొడిగించి చెప్పేది.
నేను ఐఐటీ ఖరగ్పూరు లోచేరిన కొత్తల్లో టీచెర్ల హాస్టల్లో ఉండేవాణ్ణి. నాతో పాటు నా
మిత్రుడొకడుండే వాడు.ఆ హాస్టలు మేనేజరు పేరు రాజన్. మాకన్నా పదిపదిహేనేళ్ళు
పెద్దవాడు. చాలా మంచి వ్యక్తి. కపటం తెలియదు. అందరికీ బాగా సాయం చేసేవాడు.
నా మిత్రుడు నా వయసువాడే. కాని నాకన్నా ఎప్పుడూ అన్ని రంగాలలో మున్ముందుగా
ఉండేవాడు.
నా మిత్రుడు అసిస్టెంటు ప్రొఫెసరు అవగానే రాజన్ నా దగ్గరకు వచ్చి పబ్లికుగా ఇలా
అనే వాడు:
"హలో! నీ మిత్రునికి ప్రమోషన్ వచ్చింది. మరి నీకెప్పుడొస్తుంది?"
కొన్నేళ్ళ తర్వాత నేను సంతోషంగా ఇలా అన్నాను రాజన్ తో:
"హలో సార్! నేను ఈరోజు అసిస్టెంటు ప్రొఫెసరు అయ్యాను!"
"ఓ! అదేం గొప్పా! నీ మిత్రుడు ఎప్పుడో ప్రొఫెసరు అయిపోయాడుగా!"
మరికొన్ని సంవత్సరాల తర్వాత రాజన్ నాతో ఇలా అన్నాడు:
"హలో! నీ మిత్రుడు ఈరోజు తన పెళ్ళి పత్రికలు పంచాడు. మరి నువ్వెప్పుడిస్తావ్!"
ఒక రోజు ఎందుకో నాకు రాజన్ గుర్తొచ్చాడు. నవ్వుకున్నాను.
ఆ రాత్రి నాకు ఒక కల వచ్చింది. నేను సడన్ గా స్వర్గస్థుడనయ్యానట. స్వర్గం చేరగానే
నేను రాజన్ ను వెదుకుతుండే వాణ్ణి. ఎక్కడా కనిపించక పోతే పక్కవాణ్ణి అడిగాను:
"ఇక్కడొక రాజన్ అనే వ్యక్తి ఉండాలి. ఎక్కడికెళ్ళాడు?"
"ఓ! ఆయనా! మిమ్మల్ని చూడగానే పరుగుపెట్టి ఇప్పుడే వస్తానంటూ భూలోకం
వెళ్ళాడు. అడుగో! క్రింద చూడండి దివ్యదృష్టితో!"
అలాగే నేను భూలోకానికేసి చూసాను. రాజన్ నా మిత్రునివద్దకు వెళ్ళి ఇలా
అంటున్నాడు:
...Posted by Ishani
**************************************************************************************************************************************

ఆ తర్వాత ఒకరోజు నేను సంబరంగా నా పెళ్ళి పత్రిక రాజన్ కిచ్చినపుడు:
"ఇంత లేటు గానా? నీ మిత్రుడు తండ్రై అయిదేళ్ళవుతోందిగా!"
ఈ తతంగం చాలా దశాబ్దాలు నడిచింది. నేనూ నా మిత్రుడూ దాదాపు ఒకే సారి రిటైరై
హైదరాబాదు లో స్థిరపడ్డాము. అప్పటికి రాజన్ చాలా ఏళ్ళ క్రితమే రిటైరై ఎక్కడికో
వెళ్ళిపోయాడు.
ఆ రాత్రి నాకు ఒక కల వచ్చింది. నేను సడన్ గా స్వర్గస్థుడనయ్యానట. స్వర్గం చేరగానే
నేను రాజన్ ను వెదుకుతుండే వాణ్ణి. ఎక్కడా కనిపించక పోతే పక్కవాణ్ణి అడిగాను:
"ఇక్కడొక రాజన్ అనే వ్యక్తి ఉండాలి. ఎక్కడికెళ్ళాడు?"
"ఓ! ఆయనా! మిమ్మల్ని చూడగానే పరుగుపెట్టి ఇప్పుడే వస్తానంటూ భూలోకం
వెళ్ళాడు. అడుగో! క్రింద చూడండి దివ్యదృష్టితో!"
అలాగే నేను భూలోకానికేసి చూసాను. రాజన్ నా మిత్రునివద్దకు వెళ్ళి ఇలా
అంటున్నాడు:
"ఛీ! ఛీ! ఛీ! మీరింకా ఇక్కడే తారట్లాడుతున్నారా సార్! మీ మిత్రుడు ఎప్పుడో స్వర్గం చేరి
రంభా, ఊర్వశీ, మేనకా, తిలోత్తమాలతో సరసారాలాడుచున్నాడు. మొత్తానికి ఈ
కుందేలు తాబేలు పందెం లో తాబేలే గెలిచింది! హాహాహాహాహా!"
...Posted by Ishani
**************************************************************************************************************************************
Dear Sir,
ReplyDeleteYour narration titled 'Tara Tama Rajan", is, I believe, psychology based article. We come across such people in our day to day life, especially in the circle of relatives. Please boast them selves (there is no problem in it), but, belittle others. They behave to satisfy their ago under the guise of self esteem. But, it is not "authentic self esteem", but, it is inauthentic or defensive self esteem. I searched to describe such people: "Narcissist" .....
Dear Sir,
ReplyDeleteCorrection:
Please read:.....Please boast themselves as ....they boast themselves.
The narration is excellent. If expanded, it will become a prize winning story.