Monday, August 20, 2018

శంకరార్పణం - 1047

**********************************************************************************************

శంకరాభరణం పద్య రచన - 1047

కవిమిత్రులారా!

“ఇదె కద పుణ్యకార్య మన నెల్లరు మెచ్చఁగ...”

ఇది పద్యప్రారంభం. 

దీనిని కొనసాగిస్తూ పద్యం వ్రాయండి.



ఇదె కద పుణ్యకార్య మన నెల్లరు మెచ్చఁగ సొక్క కుండ తా

పదుగురి యందు సొంపుగ శుభమ్ములు గూర్చెడి మాట లాడుచున్

చదువులు సంధ్యలన్నిటిని చాకలి రేవుల పారవేయుచున్ 

కదలుచు రాజకీయమున కమ్మగ నిమ్ముగ "సేవ" జేయుటే!




(కంది శంకరయ్య గారి సౌజన్యంతో)



***********************************************************************************************

No comments:

Post a Comment