Friday, August 10, 2018

శంకరార్పణం - 2759

*******************************************************************************



శంకరాభరణం సమస్య - 2759

"ఒక్కఁడె పాంచాలికి మగఁ డూహింపంగన్"



పెక్కురు చూచుచునుండగ 

మిక్కిలి చీరల నొసగుచు మీరిన లలితో

చక్కగ సిగ్గును నిలిపిన 

నొక్కఁడె పాంచాలికి మగఁ డూహింపంగన్!


మగడు = శూరుడు (శబ్దరత్నాకరము)





వృత్త సమస్య:

"ఒక్కఁడె భర్త ద్రౌపదికి నొక్కతె పెండ్లము కృష్ణమూర్తికిన్"



మిక్కిలి చీరలన్ పనిపి మీరిన క్లేశము తీర్చినట్టి వా 

డొక్కఁడె భర్త ద్రౌపదికి;...నొక్కతె పెండ్లము కృష్ణమూర్తికిన్

చక్కని ప్రేమపత్రమును చాటుగ బాపని చేతికిచ్చుచున్ 

గ్రక్కున జేర్చరో యనుచు కాసుల నిచ్చిన కన్నెయేగదా!




(కంది శంకరయ్య గారి సౌజన్యంతో) 


**********************************************************************************

No comments:

Post a Comment