********************************************************************************************
****************************************************************************************************
శంకరాభరణం సమస్య - 2767
" కొండలనె యలంకరించి కోమలి మురిసెన్"
ఎండలు వానలు కలబడ
పండుగ జేసె హరివిల్లు పరవశమౌచున్...
నిండుగ నగుపించె నిటుల:
కొండలనె యలంకరించి కోమలి మురిసెన్!!!
సమస్య:
"కొండ నలంకరించి సుమకోమలి మోదము నందె చిత్రమే"
భౌతిక శాస్త్రుని హావభావముల్ :)
అండగ వానజల్లులిట హాయిగ రాలుచు సొమ్మసిల్లగా
మెండుగ సూర్యరశ్మి భువి మీదుగ సోకగ క్రుంగి క్రుంగుచున్
పండుగ జేయుచున్ విరిసి పాడుచు నాడెడి నింద్రధన్వమై
కొండ నలంకరించి సుమకోమలి మోదము నందె చిత్రమే!!!
(కంది శంకరయ్య గారి సౌజన్యంతో)
****************************************************************************************************
శాస్త్రి గారికి ప్రణామములు.
ReplyDelete🙏🏻
శ్రీమాన్ పంతుల సన్యాసి రావు గారికి నమస్సులు
ReplyDelete🙏🙏🙏
😊
😄🙏🏻🙏🏻🙏🏻
Delete