Sunday, September 2, 2018

శంకరార్పణం - 1126

**********************************************************************************************


శంకరాభరణం పద్య రచన - 1126

కవిమిత్రులారా,

“ఇంతలు గన్నులుండఁ దెరు వెవ్వరి వేడెదు....”

ఇది మనుచరిత్రలోని ప్రసిద్ధపద్యానికి ప్రారంభం. 

దీనిని కొనసాగిస్తూ వరూధినీ ప్రవరులను ప్రస్తావించకుండా పద్యాన్ని వ్రాయండి.




ఇంతలు గన్నులుండఁ దెరు వెవ్వరి వేడెదు స్వర్గభూమికై?

కొంతయు దుడ్డుచేకొనుచు కోరిక తీరగ మందుకొట్టి నీ 

సొంతది కారుగైకొనుచు షోకులు మీరగ సీటుబెల్టు నా

కింతయు నిష్టముండదని క్రిందను మీదను చూడకుండ నే 

చింతయు లేకయే కులికి చిందుచు కొట్టుము మీడియన్ను ఢీ!





(కంది శంకరయ్య గారి సౌజన్యంతో)



************************************************************************************************************************************************

No comments: