Thursday, January 10, 2019

శంకరార్పణం - 2586

*******************************************************************************************************




శంకరాభరణం సమస్య - 2586

"లక్ష్మణుఁ బెండ్లియాడినది రాజిత సీత సకామయై భళా"










దుష్కర ప్రాసకు దుర్భర భాష:👇 


లక్ష్మణు గాంచ యూర్మిళమ లగ్నము కాగయె మానసమ్ము నా 

లక్ష్మణుఁ బెండ్లియాడినది;...రాజిత సీత సకామయై భళా

లక్ష్మణు భ్రాత వీరుడగు రాముని  కూరిమి పెండ్లియాడుచున్...

లక్ష్మణు తోడ రాముడును రమ్మన కుండను కానకేగుచున్ 

లక్ష్మణు దిట్టి త్రోలగను, లంకను జేరగ రావణుండితో...

లక్ష్మణు రాము హన్మనులు లంకను జేరగ సంతసించుచున్

లక్ష్మణు కూల్చ నింద్రజితు రాముడు చంపగ రావణుండనున్

లక్ష్మణు రాము చెంతనిక లంకను వీడెను నగ్నిసాక్షిగా...

సూక్ష్మపు రామగాథ యిది చుప్పున నుండుర నోరుమూయుచున్!












(కంది శంకరయ్య గారి సౌజన్యంతో)

************************************************************************************************

No comments:

Post a Comment