***************************************************************************************************
శంకరాభరణం సమస్య - 2663
"సతి సతి క్రీడ సల్ప మగసంతు జనించెను మెచ్చి రెల్లరున్"
అతివల పండుగన్ వడిగ, హాయిగ నూగుచు; నట్లు పోయుచున్
పతులకు నాయువిమ్మనుచు పాటలు పాడుచు గౌరి పూజలన్
సతి సతి క్రీడ సల్ప; ...మగసంతు జనించెను మెచ్చి రెల్లరున్
సతియును నీశు కూడగనె;...షణ్ముఖ ప్రాప్తికి సంతసించుచున్
అతివల పండుగ = అట్లతద్ది
"త్రిలోక సంచారి అయిన నారదుని ప్రోద్బలముతో గౌరీదేవి శివుని పతిగా పొందగోరి తొలుతగ
చేసిన విశిష్టమైన వ్రతమే ఈ అట్లతద్ది"
చేసిన విశిష్టమైన వ్రతమే ఈ అట్లతద్ది"
(కంది శంకరయ్య గారి సౌజన్యంతో)
**********************************************************************************************************************************************
No comments:
Post a Comment