Friday, July 19, 2019

శంకరార్పణం - 3080

*********************************************************************************************************

Image result for kalakatta kali



శంకరాభరణం సమస్య - 3080

"చెలివో చెల్లివొ తల్లివో వదినవో జేజమ్మవో యత్తవో"











జిలేబీయ మత్తేభమాలిక: 


వలపున్ జూడగ నన్ను నీవిచటభల్ బంగారునే కోరెడిన్...

బలుపౌ రాఖిని కట్టి తీసెడిని నా ప్రాణమ్మునున్ కాన్కకై...

చెలిమిన్ కాకర కూరనున్ వడివడిన్ చేకూర్చి మ్రింగించెడిన్...

తలుపున్ చాటున బీడికిన్ కొసరగా ద్రవ్యమ్ము చేకూర్చెడిన్...

కలనున్ గాంచగ ప్రీతినిన్ తరిమెడిన్  కంగారు తాతయ్యనున్...

విలనున్ బోలుచు భీతిగొల్పుచును నన్ పీడించి వెంటాడెడిన్...

చెలివో?...చెల్లివొ?...తల్లివో?... వదినవో?...జేజమ్మవో?...యత్తవో???











(కంది శంకరయ్య గారి సౌజన్యంతో)

**********************************************************************************************************

3 comments:

G P Sastry (gps1943@yahoo.com) said...

Ranga Rao (IAS):

"Bhale , Bhale! Fab. Description"

G P Sastry (gps1943@yahoo.com) said...

""అహో..ఏమాపదగుంఫన... ప్రతిపదమునకూ అప్రతిహతంగా పాదముల్చేకూర్చి మాలికలతోమత్తేభమునకే మత్తెక్కించేసితిరి మహానుభావా వందనములు.🌹🙏💐🤝👌🌹"

...డాక్టర్ మునిగోటి సుందరరామ శర్మ"

కంది శంకరయ్య said...

అబ్బో... క్రమాలంకారంలో ఒక్కొక్కరి ప్రత్యేకతలను చక్కగా వివరించి ప్రశస్తమైన పూరణ చెప్పారు. సంతోషంగా ఉంది. అభినందనలు.