**************************************************************************************************
శంకరాభరణం న్యస్తాక్షరి - 64
కవిమిత్రులారా,
గ్రంథపఠనం వల్ల ప్రయోజనాలను తెలుపుతూ
ఉత్పలమాల వ్రాయండి.
న్యస్తాక్షరాలు.......
మొదటి పాదం 5వ అక్షరం 'పు'
రెండవ పాదం 11వ అక్షరం 'స్త'
మూడవ పాదం 14వ అక్షరం 'క'
నాల్గవ పాదం 17వ అక్షరం 'ము'
"రోటీ కప్డా మకాన్" చదువు:
ఆకలి మాపుటందునను హాయిని గూర్చెడి జాబునిచ్చురా!
మైకము ద్రోలుచున్ భళిగ మస్తక మందున శాంతినిచ్చురా!
కూకట పల్లిలో నిరుకు కొంపను వాకబు చేయనిచ్చురా!
శోకము మాపుటందునను షోకగు భామను గోముగానిడున్ :)
(కంది శంకరయ్య గారి సౌజన్యంతో)
***********************************************************************************************
No comments:
Post a Comment