Monday, September 16, 2019

శంకరార్పణం - 3135

****************************************************************************************************




శంకరాభరణం సమస్య - 3135

"కుజనుల్ క్రూరమనస్కు లెల్లరు గదా గుంటూరు వాసుల్ గనన్"



(మొన్న శ్రీకాకుళం వెళ్తున్నపుడు రైలు గుంటూరు స్టేషనులో ఆగినప్పుడు సిద్ధమైన 

సమస్య. గోలి హనుమచ్ఛాస్త్రి గారు, బొగ్గరం ప్రసాద రావు గారు తదితర గుంటూరు 

మిత్రులు క్షమిస్తారని ఆశిస్తూ...)












స్వజనుల్ సత్కవి గోలిశాస్త్రివరుతో సత్సంగమున్ సల్పుచున్ 

భుజముల్ జేర్చుచు బొగ్గరంపు కవితో పూజింప వాగ్దేవినిన్

నిజమా! ఇయ్యది శంకరుల్ వచనమా! నే నమ్మజాలన్ సుమా!: 

"కుజనుల్ క్రూరమనస్కు లెల్లరు గదా గుంటూరు వాసుల్ గనన్"













(కంది శంకరయ్య గారి సౌజన్యంతో)


*************************************************************************************************************************************************

No comments:

Post a Comment