*****************************************************************************************************

శంకరాభరణం సమస్య - 3164
"నిద్దురపోవువాఁడు ధరణిన్ ఘనకీర్తి వహించి మించెడున్"
మధుర స్మృతులు: 1956: కీ. శే. ఆకిలి శ్రీరామ శర్మ, తెలుగు పండితులు, ముత్తుకూరు:
కొద్దిగ పంచతంత్రమును కొద్దిగ నన్నయ భారతమ్మునున్
కొద్దిగ విశ్వనాథులను కొద్దిగ సాక్షిగ పానుగంటినిన్
కొద్దిగ నర్ధ బిందువును కొద్దిగ సంధుల సూత్ర శాస్త్రమున్
ముద్దుగ పల్కుచుండగను బుద్ధిని వీడుచు లాస్టు బెంచిలో
నిద్దురపోవువాఁడు ధరణిన్ ఘనకీర్తి వహించి మించెడున్ :)
(కంది శంకరయ్య గారి సౌజన్యంతో)
*************************************************************************************************
No comments:
Post a Comment