******************************************************************************************************
శంకరాభరణం పద్య రచన - 1080
“కటకట యెంతమాట ననుఁ గాదని యాతఁడు...”
ఇది పద్యప్రారంభం.
దీనికి కొనసాగిస్తూ పద్యాన్ని పూర్తి చేయండి.
కటకట యెంతమాట! ననుఁ గాదని యాతఁడు ప్రక్కనింటిదౌ
బటువగు భామ నొల్లుచును బంగరు బొమ్మని కన్నుగొట్టగా
కిటికిని మూసి వేయుచును క్రిందను త్రోయుచు వెల్లకిల్లగా
పటపట పండ్లు రాలగను పట్టుకు కొట్టితి బండఱాతితో
(కంది శంకరయ్య గారి సౌజన్యంతో)
**********************************************************************************************
No comments:
Post a Comment