******************************************************************************************************
శంకరాభరణం దత్తపది - 152
(సంధి-సమాస-కారక-క్రియ)
సంధి - సమాస - కారక - క్రియ
పై పదాలను ప్రయోగిస్తూ
భారతార్థంలో
మీకు నచ్చిన ఛందంలో పద్యాన్ని వ్రాయండి.
సందర్భం: కలకత్తా కూటమి
బంధులు సక్రియమ్మునగు బంగలు కన్నియ కన్నుగీటగా
సంధిని కోరుచున్ వడిగ సందడి జేయుచు జేరిరచ్చటన్
రంధియె కారకమ్ముగద రచ్చను మోడిని పాతిపెట్టు దు
ర్గంధ సమాసకమ్మునగు "గందర గోళపు గొంతుచించుటన్"
సక్రియము = చురుకుతనము కలది
కారకము = చేయునది
సమాసకము = శుద్ధాంధ్ర పదముల సమాసము
(ఆంధ్రభారతి)
**************************
"సహజంగా సమస్యలన్నింటికీ పూరణలకు మహాభారతం అనువుగా ఉంటుందని ఆర్యోక్తి.... మీకు కూడా
అదే... అయితే...మన భారతం"
...మైలవరపు మురళీకృష్ణ
(కంది శంకరయ్య గారి సౌజన్యంతో)
*******************************************************************************************************************************************
No comments:
Post a Comment