Saturday, January 19, 2019

శంకరార్పణం దత్తపది - 152

******************************************************************************************************






శంకరాభరణం దత్తపది - 152
(సంధి-సమాస-కారక-క్రియ)

సంధి - సమాస - కారక - క్రియ

పై పదాలను ప్రయోగిస్తూ

భారతార్థంలో

మీకు నచ్చిన ఛందంలో పద్యాన్ని వ్రాయండి.










సందర్భం: కలకత్తా కూటమి 


బంధులు సక్రియమ్మునగు బంగలు కన్నియ కన్నుగీటగా 

సంధిని కోరుచున్ వడిగ సందడి జేయుచు జేరిరచ్చటన్

రంధియె కారకమ్ముగద రచ్చను మోడిని పాతిపెట్టు దు
 
ర్గంధ సమాసకమ్మునగు "గందర గోళపు గొంతుచించుటన్" 


సక్రియము = చురుకుతనము కలది 

కారకము = చేయునది 

సమాసకము = శుద్ధాంధ్ర పదముల సమాసము


(ఆంధ్రభారతి)


**************************

"సహజంగా సమస్యలన్నింటికీ  పూరణలకు మహాభారతం అనువుగా ఉంటుందని ఆర్యోక్తి.... మీకు కూడా 

అదే... అయితే...మన భారతం" 


...మైలవరపు మురళీకృష్ణ









(కంది శంకరయ్య గారి సౌజన్యంతో)


*******************************************************************************************************************************************

No comments: