Monday, June 8, 2015

ఇషాని శతకం 31 - 40

********************************************************************************************************************************************














31.    కొంగ లెగిరి వాలి గంగ గోవుల మీద

  పొట్ట నిండ తినవె పురుగు లన్ని


  శిష్యు లిటుల చేరు సద్గురు సన్నిధి


  శ్రధ్ధ బెట్టి వినుము చిన్న ఇషని



32.    రాగి చెంబు చిలుము ఆగి ఆగి వొదులు

  స్వర్ణ కంక ణంబు మెరియు నెపుడు

  మంద సూక్ష్మ బుధ్ధు లిందు పోలిక నుండు


  శ్రధ్ధ బెట్టి వినుము చిన్న ఇషని



33.    పచ్చ పండు పైన గచ్చ కాయను బోలు

   జఠిల ఫలము( దాగు జీడి పప్పు

   గూఢ సత్య మిటుల గుప్తమై యుండును

  శ్రధ్ధ బెట్టి వినుము చిన్న ఇషని



34.    చిలక లెన్నొ ఎగిరి జామ చెట్టు న వాలి

   పండ్ల నింతె కొరికి పారి పోవు

   వ్యర్ధ మిటుల జేయు విలువ లెరుగనోళ్ళు

  శ్రధ్ధ బెట్టి వినుము చిన్న ఇషని



35.    ఎలుక లన్ని చేరి కలుగులోపల దూరి

   పొంచి పొంచి దాగు సంచి కొరుకు

   పాపు లిటుల చెరుచు పుణ్య మింత త్రుటిలొ

  శ్రధ్ధ బెట్టి వినుము చిన్న ఇషని



36.   మట్టి బొమ్మ చుట్టు గడ్డి జుట్టి నిలుచు

   దిష్టి బొమ్మ తోలు పక్షు లన్ని

   మౌన వ్రతుడు నటుల హీను లందరి దోలు

  శ్రధ్ధ బెట్టి వినుము చిన్న ఇషని



37.   కాగు చున్న నీళ్ళ కరుగు నింతనె ఉప్పు

   చల్ల నీళ్ళ కరుగ నెలలు బట్టు

   చురుక గున్న బుధ్ది చిటిక  లోన నె నేర్చు

   శ్రధ్ధ బెట్టి వినుము చిన్న ఇషని



38.   పాల గిన్నె జిడ్డు పీచు రుద్దిన వొదులు

   బూజు వొదల గొట్టు బూజు కర్ర

   గడ్డి తిన్న బుధ్ధి గురువు దెబ్బకు లొంగు

   శ్రధ్ధ బెట్టి వినుము చిన్న ఇషని



39.   కాలి ముల్లు దీసి కాల్చి భస్మము జేసి

       నీట గలిపి తాగె నాడు నొకడు

                           పోగ మనసు జింత శోక మెచట దాగు

   శ్రధ్ధ బెట్టి వినుము చిన్న ఇషని


40.   పాల జలధి పైన పవళించు దేవుడు

   పరుగు లిడుతు వచ్చి భక్తు బ్రోచె

   దయ గరిగిన హృది దాప్యము జేయునే

   శ్రధ్ధ బెట్టి వినుము చిన్న ఇషని







...Posted by Ishani

**********************************************************************************************************************************************

No comments: