**************************************************************************************************************************************
...Posted by Ishani
*******************************************************************************************************************************************
51. ‘కెక్కె కెక్కె’ యనుచు గరుడ పక్షు లెగురు
కొంత మంది కదియె ‘క్రిష్ణ! క్రిష్ణ!’
భావ జగతి యందు భేద మిటుల నుండు
శ్రధ్ధ బెట్టి వినుము చిన్న ఇషని
52. మాట లాడి నంత మాట కారి అనురు
మౌన వ్రతము నుండ మూగి అనురు
దాహ మెటుల తీరు సాగర మును గ్రోల
శ్రధ్ధ బెట్టి వినుము చిన్న ఇషని
53. ఉడక పెట్టి నంత వంకాయ మెత్తనౌ
కోడి గుడ్డు ఉడికి గట్టి పడును
శిక్ష దిద్దు రీతి చెప్ప లేము ధరలొ
శ్రధ్ధ బెట్టి వినుము చిన్న ఇషని
54. కొండ టెత్తు ఏన్గు కూర గాయలు దిను
పెద్ద ఎలుకను తిను పిల్లి కూన
వింత లెన్నొ భువిలొ వెదకి తరచి చూడ
శ్రధ్ధ బెట్టి వినుము చిన్న ఇషని
55. నార దుండు జేసె చోరుని వాల్మీకి
కాళి జేసె మూఢ్ని కాళి దాసు
క్షణము లోన మారు గుణము దైవ దయన
శ్రధ్ధ బెట్టి వినుము చిన్న ఇషని
56. బరువు పుచ్చ కాయ కరిగి పోవును నోట
మిరప గింజ గంట చురుకు మనును
భ్రాంతి చెంద వలదు బరువు పొడవు కొల్చి
శ్రధ్ధ బెట్టి వినుము చిన్న ఇషని
57. ఒడలి లోన ఉడుత త్రుటిలొ పరుగుబెట్టు
చంక లోని పిల్లి ఛుప్పునుండు
చిత్త వృత్తు లిటులె చపలా చపలములౌ
శ్రధ్ధ బెట్టి వినుము చిన్న ఇషని
58. దోస పప్పు ధరలు పైసలలో నుండు
సార పప్పు కొనగ జేబు ఖాళి
ధరలొ వెలల తార తమ్యము గూఢమౌ
శ్రధ్ధ బెట్టి వినుము చిన్న ఇషని
59. అరటి
చెట్టు ఇచ్చు అరటి కాయను, పండు,
అరటి ఆకు, పూవు, అరటి బొందె,
దాత లిటులె నిచ్చు ధన ధాన్యములు విద్య
శ్రధ్ధ బెట్టి వినుము చిన్న ఇషని
60. రాయ
గానె నెవడు రచయిత కాబోడు
పలుక గానె కాడు పండి తుండు
పుట్ట గానె పిల్ల పెళ్ళి కూతు రవునె
శ్రధ్ధ బెట్టి వినుము చిన్న ఇషని
...Posted by Ishani
*******************************************************************************************************************************************
No comments:
Post a Comment