Monday, June 8, 2015

ఇషాని శతకం 71 - 80

******************************************************************************************************************************************











71.    ఉల్లి గడ్డ చూడ తెల్లగ నుండును

   నోట బెట్ట ఘాటు నొసటి కంటు

   ఉల్లి జేయు మేలు తల్లి చేయ దనెరు

   శ్రధ్ధ బెట్టి వినుము చిన్న ఇషని



72.    మెరిసి ఉరిమి జడిపి కురిసి వెలిసినంత

   ఇనుడు నొసగు తూర్పు నింద్ర ధనుసు

   చింత లన్ని తీర్చు చంటి పిల్లడి నవ్వు

   శ్రధ్ధ బెట్టి వినుము చిన్న ఇషని



73.    ఇనుప స్తంభ మైన వాన దడిసి ఎండి

   తుప్పు పట్టి నంత తునిగి పోవు

   విరిగి పోవు నటులె విరస మైన చెలిమి

   శ్రధ్ధ బెట్టి వినుము చిన్న ఇషని



74.    తోక నున్న ఘాటు తెలియ లేని మృగము

   తోట జుట్టు వెదకి తిరుగు చుండు

   పరుగు తీయు నటులె ప్రేమ కోరి మనసు

   శ్రధ్ధ బెట్టి వినుము చిన్న ఇషని



75.    నల్ల టావు గూడ తెల్లని పాలిచ్చు

   గింజ లేని ద్రాక్ష కమ్మ గుండు

   పళ్ళు లేని పాప బోసి నవ్వు ప్రియము

   శ్రధ్ధ బెట్టి వినుము చిన్న ఇషని



76.    మండు టెండ మాడి వేడి గాలులు వీచి

   వాన జల్లు కొరకు వగచు నేల

   దీను డటులె వగచు దైవ కృపను కోరి

   శ్రధ్ధ బెట్టి వినుము చిన్న ఇషని



77.    మెరియు చుండు నీరు మృగ తృష్ణ( దళ తళ

   పారి పోవు త్రాగ దూరము గను

   దాహ మెటుల తీర్చు ధన ధాన్య యశము

   శ్రధ్ధ బెట్టి వినుము చిన్న ఇషని



78.    వెన్న ముద్ద కరుగు వేడి చేయ త్రుటిలొ

    గంట పట్టు పెరుగు గడ్డ గట్ట

    మనిషి మనిషి హృదయ మీరీతి భిన్నమౌ

    శ్రధ్ధ బెట్టి వినుము చిన్న ఇషని



79.    బంక మట్టి తెచ్చి బొమ్మ చేసి మనము

    పూజ చేసి నీళ్ళ పెట్టి నటులె

    మనల జేసి మరల తనలొ కలుపు నాత్మ

    శ్రధ్ధ బెట్టి వినుము చిన్న ఇషని



80.     వరద లొచ్చి నదికి పైరు నష్టము చేసి

    మట్టి తెచ్చి నేల గట్టి జేయు

    బాధ లొచ్చి అటులె బుధ్ధి గట్టిగ చెప్పు

    శ్రధ్ధ బెట్టి వినుము చిన్న ఇషని














...Posted by Ishani

**********************************************************************************************************************************************

No comments:

Post a Comment