Tuesday, August 14, 2018

శంకరార్పణం - 2763

*****************************************************************************************




శంకరాభరణం సమస్య - 2763

"స్వేచ్ఛ వచ్చెఁ దెగవు దాస్య శృంఖలములు"


వేయి సంవత్సరమ్ములు వేచియుండి

భారతీయుల కింపుగ పరులనుండి

స్వేచ్ఛ వచ్చెఁ; ....దెగవు దాస్య శృంఖలములు

బీదసాదల బాధల రోదనముల!








"స్వేచ్ఛ లభించె దాస్య ఘన శృంఖలముల్ దెగ వేమి సెప్పుదున్"


స్వచ్ఛపు భారతీయతకు చప్పుడు చేయుచు డప్పుకొట్టగా...

తుచ్ఛపు వాసనల్ విడక తుంటరి చేష్టల రాజనీతికిన్ 

స్వచ్ఛగ వీధిమధ్యమున చక్కని భామల వెక్కిరింతకున్ 

స్వేచ్ఛ లభించె; దాస్య ఘన శృంఖలముల్ దెగ వేమి సెప్పుదున్ :)



(కంది శంకరయ్య గారి సౌజన్యంతో)



**************************************************************************************************

No comments: