*****************************************************************************************
శంకరాభరణం సమస్య - 2773
"పోతన కావ్యమున రసపోషణ లేదే"
నూతన పాండితి ప్రియుడై
కోతలు కోయుచు విరిసెడి కోలాటమునన్
వేతన కోవిదుడనియెను:
"పోతన కావ్యమున రసపోషణ లేదే!"
శంకరాభరణం సమస్య - 2773
"పోతన కావ్యమందు రసపోషణ సుంతయుఁ గానరాదయో"
వేతన భత్యమందునను వేడుక సుంతయు కానరాదయో
నేతల చేతలందునను నేరము సుంతయు కానరాదయో
జాతక చక్రమందునను చంద్రుడు సుంతయు కానరాడయో...
పోతన కావ్యమందు రసపోషణ సుంతయుఁ గానరాదయో!
(కంది శంకరయ్య గారి సౌజన్యంతో)
*********************************************************************************************
No comments:
Post a Comment