Wednesday, August 15, 2018

శంకరార్పణం - 2764

*************************************************************************************************



శంకరాభరణం సమస్య - 2764

"కోడలి పొందభిలషించెఁ గుణకోవిదుఁడే"


ఆడెడి పాడెడి తనదై 

నాడుది స్వర్గమును జేర నలయుచు భువిలో

కూడుకు గుడ్డకు మందుకు 

కోడలి పొందభిలషించెఁ గుణకోవిదుఁడే



పొందు = స్నేహము






సమస్య: 

"కోడలి పొందుఁ గోరె గుణకోవిదుఁ డామెయు సమ్మతించెఁగా"



ఓడగ నెన్నికన్, విడక, నోటమి నొల్లక, దొడ్డిదారిలో

కూడుచు పార్లమెంటునను కూరిమి తీరక, నాయకుండుగా 

తాడును పేడునున్ గనక, తందన తానని నిందిరమ్మదౌ

కోడలి పొందుఁ గోరె గుణకోవిదుఁ డామెయు సమ్మతించెఁగా


పొందు = స్నేహము








(కంది శంకరయ్య గారి సౌజన్యంతో)












*************************************************************************************************

No comments: