*******************************************************************************************
****************************************************************************************
శంకరాభరణం సమస్య - 2765
" సవతి లేని సంసారము సాగు టెట్లు"
ఉప్పు, పసుపు, కంది, పెసల పప్పు, పులుపు,
బియ్యము, మిరప కాయలు, నెయ్యి, నూనె,
గిన్నెలు, గరిటలు, పెనము, గేసుతో; ర
సవతి లేని సంసారము సాగు టెట్లు???
రసవతి = వంటిల్లు
"సవతియె లేని కాపురము సవ్యముగాఁ గొనసాగు టెట్టులో"
నవనవ లాడు చీరలును నాణెపు దుద్దులు బేరమాడుచున్
కవరున దాచినట్టి పలు కార్డులు గీకుచు చింతలేకయే
చవిగొని మాలులన్ వెలయు షాపుల గోలలు గ్రోలెడిన్ విలా
సవతియె లేని కాపురము సవ్యముగాఁ గొనసాగు టెట్టులో!!!
(కంది శంకరయ్య గారి సౌజన్యంతో)
****************************************************************************************
No comments:
Post a Comment