Wednesday, July 6, 2016

Freedom from Religion

******************************************************************************************************************************











...Posted by Ishani

*********************************************************************************************************************************

Monday, June 20, 2016

Great Read from Times of India

************************************************************************************************************************

Don’t Torture The Dying: 


Health ministry’s draft law confuses between euthanasia and withdrawal of life support


June 20, 2016, 2:00 AM IST 


in TOI Edit Page | 
| TOI


The Constitution of India guarantees life with dignity as a fundamental right. Generally speaking, we enjoy this right. But it all changes if we get an incurable disease. Or when we eventually wither and die of old age. In those circumstances, we should still have the right to live the way we want to and die where we want to. But we find that we no longer have any choice.
An Economist study found that India was one of the worst 15 countries in the world to die in, coming 67th out of 80 in “quality of death”. In India, as we near the end of life, we cease to be treated as human beings and become mere containers of disease.
Until it is seen or experienced, it is not easy to understand the degree of assault on dignity by inappropriate medical treatment in incurable diseases. Typically, even if one is fully alert and able to take decisions for oneself, one finds oneself stripped of that privilege.
Whether it is advanced cancer or some other illness, the family takes over and makes decisions, and the “patient” is bundled into a hospital. There, in turn, the family loses control; hospital protocol takes over and transfers the patient to an intensive care unit.
In his last days, when one should be with the loving family with a gentle touch, one finds oneself isolated from dear ones when they are needed most. At a time when the deepest desire is to see a grandchild once more and to bestow a kiss on that cheek, one finds that children are not permitted into the holy intensive care unit.
The immediate family is allowed in for five minutes twice a day, but they are afraid to touch; the body is literally covered with cables; there are alarms screeching. Even when everyone knows that the patient is dying, a tube is inserted into every orifice in the body.
Among the many tubes, one is likely to be passing through the voice box into the wind pipe. These are some of the most sensitive parts of the body. A catheter periodically pushed into it to aspirate mucus is one of the most painful things one can experience – “like a red-hot iron pushed into you and twisted as it is withdrawn”, as one person described it. You have never known that such pain was possible; it is beyond the average person’s power of imagination.
When one feels a weariness of a degree that cannot even be imagined and longs for some peace to shut the eyes, it is prevented by a perpetually lighted room with no distinction between night and day (does that remind you of torture chambers?), with dozens of frightening beeps and screaming alarms, and weird masked creatures walking around.
Fear overcomes the person; there is an urge to know what is happening; but that tube in the voice box prevents speech, and no one bothers to give any information. When one panics and tries to pull out the tubes, the nurses bind the hands and feet. The right to life with dignity is violated in the cruellest way.
I am a doctor and have been an intensivist. I know very well that intensive care can dramatically save lives. But i also know that it is the most horrendous infliction of suffering and violation of human dignity in the context of incurable illness. We should be able to recognise that death is the inevitable consequence of life and that the person should be allowed to go with as much dignity as possible.
The government of India has prepared a draft law on the subject, available at the website of the ministry of health and family welfare. Its objective is to “protect” the terminally ill; to ensure life and death with dignity and to provide for palliative care as the humane, viable alternative to intensive care.
However, as drafted, the law confuses between euthanasia, which is wilful termination of life, and withdrawal of life support, which is only permitting natural death. Today, you have the privilege of leaving advance directives – which, in the absence of any existing law on the matter, has the backing of Medical Council of India. But this new draft law says that “every advance medical directive (called living will) or medical power of attorney executed by a person shall be void and of no effect and shall not be binding on any medical practitioner”.
The implication of the draft law would be that when one is no longer competent to communicate decisions and the family decides to respect the person’s expressed wishes to refuse life support measures like artificial ventilator, they will have to apply to the state high court. The draft law provides for ‘quick’ action by the division bench of the high court – in one month. One month. One month in which every moment is agony. One month, in the first week of which treatment costs in an intensive care unit would have impoverished the family and left them homeless.
This law is not really about them. This is about us – each one of us and our families. The new law threatens to violate our autonomy and dignity at the most vulnerable time of our lives. We must all protest and prevent it from coming into force.

DISCLAIMER : Views expressed above are the author's own.
Dr. M. R Rajagopal.jpg
M. R. Rajagopal, MD, (born 23 September 1947) is an Indian palliative care physician. He is the Founder Chairman ofPallium India, a palliative care non-governmental organisation based in Kerala, India. He is often referred to as the 'father of palliative care in India' in honour of his significant contribution to the palliative care scene in India
*htt****************************************************************************************************************************

Friday, June 17, 2016

నిరాదర్శవాది

***********************************************************************************************************************************


చిన్నతనం లో అందరు పిల్లలూ తప్పులు చేస్తూ ఉంటారు. అబధ్ధాలాడతారు. ఇది ప్రకృతి సహజం.

చిన్ని కృష్ణుడు వెన్న దొంగిలించేవాడు. మన్ను తినేవాడు. ఏమిరా మన్ను తిన్నావా అంటే లేదని బుకాయించేవాడు.

తాము ఎన్ని తప్పులు చేసినా పిల్లలు వాళ్ళ తలితండ్రులు తప్పులు చేస్తే సహించలేరు. క్షమించరు. ముఖ్యంగా పెద్దలు అబధ్ధాలు చెబితే పిల్లలు చిన్నబుచ్చుకుంటారు.

ఎందుకంటే పిల్లలు సహజంగా ఆదర్శవాదులు. ముఖ్యంగా తమ తండ్రులను తమ ఆదర్శంగా ఎన్నుకుంటారు.

నాకు ఊహ తెలిసినప్పట్నుంచీ మానాన్నగారు హెడ్మాస్టరు. అబధ్ధాలు అసలు చెప్పేవాడు కాదు. ఒక్క దురలవాటు కూడా ఆయనలో ఉండేది కాదు. పైగా లెఖ్ఖల్లో నా చిన్నప్పుడు ఆయన జీనియస్ అనుకునేవాణ్ణి. నాకు రాని లాభ నష్టాలవీ, కాలం-పనివీ ఆయన మనసులోనే చేసి చూపించేవాడు.

అందుకని మా నాన్నగారినే నేను ఆదర్శంగా ఎన్నుకున్నాను. కానీ నేను నాలుగో ఫారం లో చేరగానే కాంపోసిట్ మేథ్స్ తీసుకునే సరికి ఆయనకు ఆల్జీబ్రా రాదనీ, సైన్ 30 ఎంతో చెప్పలేరనీ గ్రహించి చాలా దు:ఖించాను. అది నా జీవితంలో నాకు జరిగిన ప్రధమ నిరాశ.

ఆపైన నేను కాలేజీ చదువులకు మా పెదనాన్నగారింట్లో చేరాను. ఆయన మా కాలేజీ ప్రిన్సిపాలు. నెల్లూరు షేక్స్పియరని పేరు పొందారు.  చాలా హుందాగా ఉండేవారు. రమణమహర్షి ప్రియ శిష్యుడు. ఆయన్నే నేను ఆదర్శంగా ఎన్నుకున్నాను.

కానీ ఒకరోజు ఆయన రిక్షా ఎక్కి విశాఖపట్నానికి పెద్ద పనిమీద బయల్దేరుతూంటే నాకు ఘట్టిగా తుమ్ము వచ్చింది. ఆపుకోలేక పోయాను. అప్పుడాయన రిక్షా దిగి ఇంట్లోకి వచ్చి కొంచెం విసుక్కొంటూ కొంచెం కసురుకొంటూ బాత్ రూములోకి వెళ్ళి కాళ్ళు కడుక్కొనివచ్చి సీరియస్ గా ముఖం పెట్టి రిక్షా ఎక్కి వెళ్ళారు.

దాంతో నేను బాగా చిన్నపుచ్చుకున్నాను. అప్పటికి నాకు 14 ఏళ్ళు. 

ఆపైన నేను యూనివర్సిటీ లో గడిపిన 7 సంవత్సరాలలోనూ ఎంత వెదికినా నాకు ఆర్శంగా ఎవ్వరూ కనిపించలేదు.

అటు పిమ్మట నేను ఐఐటీ ఖరగ్పూరులో టీచర్ గా చేరాను. అప్పుడు నాకొక పీ హెచ్ డీ గైడు దొరికారు. నాకన్నా 30 ఏళ్ళు పెద్ద. నా జీవితంలో నేను సన్నిహితం గా చూసిన జీనియస్ ఆయన ఒక్కరే. ఇప్పటికీ. 

ఒక రోజు నేను వాళ్ళింటికి పనిమీద వెళ్ళినప్పుడు ఆయన దిగాలుగా సోఫాలో కూర్చుని చింతిస్తూ ఉండేవారు. కొన్ని నిముషాలకు ఆయన కళ్ళల్లో నీళ్ళు కుక్కుకుంటూ ఒక బెంగాలీ వారపత్రిక నాకు చూపించారు. అందులో ఎవరో ఒక లిస్టు తయారు చేసి ప్రచురించారు: బెంగాలులో ప్రముఖులైన 20 మంది అత్యద్భుత టీచర్లు.

ఆ వెఱ్ఱి లిస్టులో ఆయన పేరు లేదు. అదీ ఆయన దు:ఖానికి కారణం. నాలో నేను నవ్వుకొన్నాను. 

అప్పటికే నాకు 30 ఏళ్లు. ఆపైన నేను నాకు ఆదర్శంగా ఎవరినీ వెదకడం మానేశాను. దేహ ధారణ చేసిన ప్రతి వ్యక్తిలోనూ నాకు కనిపించే లోపం ఏదో ఒకటి ఉంటుందని గ్రహించాను.


కానీ ఈరోజుకీ పడుకునే ముందు "ఆరోజు ఆపని చెయ్యకుండా ఉంటే బాగుండేది. అప్పుడామాట అనకుండాఉంటే బాగుండేది. ఈరోజు ఈ ఆలోచన రాకుండా ఉంటే బాగుండేది" అని చింతిస్తూ పడుకుంటాను.


అప్పుడప్పుడూ నాలో నేను నవ్వుకుంటాను: 

"కాటికి కాళ్ళు జాచుకున్న నేను హాయిగా ఉండకుండా ఈ ఆలోచనలోతో సతమతమవడం ఎందుకో" అని.

బహుశా నాకింకా కుర్రతనం పోలేదేమో....




  ...Posted by Ishani

***************************************************************************************************************************************

మార్పూ - తీర్పూ

************************************************************************************************************************************


1995- IIT Kharagpur - Qrs B-140


అప్పుడు నా వయసు 52. అప్పటికే 30 ఏళ్ళ సర్వీసు. లంకంత కొంపలో నేనూ, నా భార్యా, మా 14 ఏళ్ళ అబ్బాయి సుఖంగా కాలం గడుపుచూ ఉండేవాళ్ళం.

ఒక రోజు రోడ్డుకు ఎదురుగా ఉన్న క్వార్టర్స్ లో నూత్న దంపతులు చేరారు. చక్కగా చిలకా గోరింకల్లా ఉన్న వాళ్ళిద్దరినా చూస్తుంటే మాకు చాలా సంతోషం కలిగింది. పైగా చూడబోతే అచ్చు తెలుగు దంపతుల్లా ఉన్నారు.

మర్నాడు సాయంత్రం బెల్లు మోగి తలుపుతీయగానే ఆ దంపతులే. లోపలికి ఆహ్వానించి కబుర్లూ కాకరకాయల్లో పడ్డాము హ్యాపీగా. 

అమ్మాయి పేరు సీత. ఆమె చెప్పింది: తన అన్నగారు 'హనూ' 25 ఏళ్ళక్రితం మా స్టూడెంటట. ప్రస్తుతం ఢిల్లీలో మినిస్ట్రీలో సెక్రటరీ.  బావా చెల్లాయి తో అన్నాడట: మీరు ఖరగ్పూరు చేరగానే జీ పీ శాస్త్రి గారనే ఫిజిక్సు టీచర్ని కలవండి. మా ఫేవరిట్ టీచరు. అని. 

"అందుకే మిమ్మల్ని కలవడానికి వచ్చాము.  మీకు హనూ గుర్తున్నాడా?"

"ఓ! చాలా బాగా గుర్తున్నాడు. ఇన్నేళ్ళ సర్వీసు లో తనొక్కడే హనూ"

చిన్ననాటి రోజులు గుర్తొచ్చి నేను చాలా సంబరపడ్డాను. అతిత్వరలోనే సీత గారు నా భార్యకు సన్నిహితం అయ్యారు. సీత గారిని మా ఆవిడ తన కూతురులాగే భావించేది. పండుగలూ పర్వాలూ పిండివంటలూ పూజలూ పునస్కారాలూ జాయింటుగా జరిగేవి.

ఆర్నెల్ల తర్వాత సీత గారు ఢిల్లీ వెళ్ళి వారం రోజుల తర్వాత తిరిగి వచ్చారు. ఆరోజే మాఇంటికి ఆలూమగలూ వచ్చారు. రాగానే సీత గారు నాతో ఇట్లన్నారు:

"మేము ఢిల్లీలో ఇల్లు చేరగానే హనూ నన్నడిగాడు. జీ పీ శాస్త్రి గారింటికి వెళ్ళారా అని. వెళ్ళాము చాలా సార్లే. ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయిపోయాముఅని. చాలా సంతోషించి అడిగాడు: సన్నగా బక్కగా ఉంటారు కదా అని. నేను అదేమీలేదే అన్నాను. క్లాసుకు వచ్చేముందూ క్లాసు అయ్యాకా సిగరెట్టు పీల్చేవారు. నిత్యాగ్నిహోత్రులు కదా అన్నాడు. అబ్బే! లేదు...మేమున్న గంటలు గంటల్లో ఒక్క సారి కూడా పొగ పీల్చలేదే. అప్పుడన్నాడు: ఆయన ఆజన్మబ్రహ్మచారి కదా...ఎప్పుడూ హాస్టల్లో ఉండేరకం కదా. అని...అదేమీ లేదు. చక్కటి భార్యా ముచ్చటి కొడుకూ అన్నాను. హనూ ఒక నిమిషం ఆలోచించి అన్నాడు: మీరు చూసింది మాటీచర్ శాస్త్రిగారిని కాదు...వేరే ఎవరినో. అని."

అలా అని సీత గారు నన్నడిగారు:

"చిన్నప్పుడు మీరు బక్కపీచుల్లా ఉండేవారా సార్?"

"అవును..."


"చైన్ స్మోకరా?"


"అవునవునవును..........."


"ఆజన్మ బ్రహ్మచారా?'


"అవునవునవునవునవును...................................."











...Posted by Ishani

*************************************************************************************************************************************

Thursday, June 16, 2016

చేదు నిజం

**********************************************************************************************************************************************



















మా చిన్నప్పుడు దేశోధ్ధారక కాశీనాధుని నాగేశ్వర రావు గారు (అమృతాంజనం
పంతులు) స్థాపించిన మాస పత్రిక 'భారతి' చాలా గొప్పగా ఉండేది. 

అందులో శ్రీ మధురాంతకం రాజారాం గారి కథలు అద్భుతంగా ఉండేవి. ఆయన
వ్రాసిన ఒక కథ 'చేదు నిజం' అరవై ఏళ్ళ తర్వాత కూడా ఇప్పటికీ నాకు బాగా జ్ఞాపకం.

ఆ కథ గురించి వేరేగా ఎప్పుడైనా రాస్తాను.

ఈరోజు నా బాల్యం లో నాకు జరిగిన ఒక చేదు నిజం కథ చెబుతాను:


1953:

ముత్తుకూరు హై స్కూలులో మాడో ఫారం చదువుతుండేవాణ్ణి. వయసు పదేళ్ళు. శెలవు వస్తే చాలు ఖాఖీ చెడ్దీ తెల్ల డ్రిల్ చొక్కా తగిలించి ఊళ్ళో ఉన్న ఒకే ఒక రోడ్డులో బోడి సైకిల్ టైరు చేతిలో కర్రపుల్ల తో తోసుకుంటూ పరుగులుపెట్టడం ఆనవాయితీ. 

మా నాన్నగారు మా స్కూలు హెడ్మాస్టరు. 

ఒక ఉదయం అలా పరుగులు తీస్తుంటే రోడ్డు పక్కన ఉన్న ఒకే ఒక టైలరు షాపు నుంచి కేక వినిపించింది:

"అబ్బాయి! అబ్బాయి! ఒక సారి ఇలా రా!"


ఏమైందోనని టైరు కిందపడేసి వెళ్ళాను. ఎప్పుడూ చూడని ఒక రెడ్డి గారు కూచొని ఉన్నారు. స్టూలు మీద. సిలుకు జిబ్బా. సిలుకు పంచె. చేతికున్న వేళ్ళల్లో అన్నిటికీ ఉంగరాలు. మెడలో బంగరు దండ. చేతిలో సిగరెట్టూ. 

నన్ను చూసి రెడ్డిగారు చిన్న చిరునవ్వొకటి బహూకరించారు. ఇంతలో మా టైలరు నన్ను తన ఎదురుగా నిలబెట్టి షర్టుకూ ప్యాంటుకూ చకచకా కొలతలు తీసి చెవిలో పెనిసిలు తీసి పుస్తకం లో రాసుకున్నాడు. తరువాత ఇక పో అన్నట్టు సైగ చేశాడు. రెడ్డి గారు మరో చిరునవ్వు ఒలికించాడు.

సైకిలు టైరు తోసుకుంటూ పరుగులు తీస్తూ ఆలోచనల్లో పడ్డాను. 

మరునాటినుంచీ రోజూ రోడ్డు మీద పరుగులు తీస్తున్నప్పుడల్లా టైలరు కేసి చూసేవాణ్ణి. నా కొత్త బట్టల బహుమతి ఎప్పుడిస్తాడా అని. ఆశగా.

ఇలా ఒక నెల గడిచింది. 

ఇక ఆగలేక ఒక రోజు టైలరు షాపు లో దూరి తనని అడిగాను:

"ఆ రోజు రెడ్డి గారు నా కొలతలు తీయించినాడే...ఆ బట్టలు రెడీ అయ్యాయా?"

"ఆ! ఎప్పుడో రెడీ! ఆ ఈపూరు రెడ్డిగారు అర్జంటుగా కావాలంటే మూడో రోజే ఇచ్చేశాను. ఆయన చిన్న కొడుకు జన్మదినానికి ఆయన కుట్టించి ఇచ్చిన సీక్రెటు గిఫ్టట సిలుకు డ్రెస్సు. వాళ్ళబ్బాయి కరెక్టుగా నీ సైజే ఉంటాడట. అందుకని చూసి చూసి నిన్ను పిలిపించాడు ఆ రోజు."






...Posted by Ishani

***********************************************************************************************************************************************

Tuesday, June 14, 2016

తర తమ రాజన్

****************************************************************************************************************************************




మానవుని మనస్తత్వం ఒకటి రెండు తరాలలో మారదు. మారేది వారి కాపట్యమే. దీన్నే

కొందరు నాగరికతగా భావిస్తారు.


మాపైతరం - తండ్రులూ తాతలూ పిన్నులూ పెద్దమ్మలూ...- ఇళ్ళల్లో పిల్లలను

ఒకరితోనొకరిని పోల్చి బహిరంగంగా ప్రకటించేవారు...


"వీడు నల్లగా ఉంటాడు వాడు తెల్లగా ఉంటాడు. ఇది మొద్దు అది తెలివిగలది..."..ఇలా ఇలా...


పిల్లలు ఎంత పెద్దవారయినా పెద్దల బుధ్ధులు మారేవి కాదు.


నేను ఉద్యోగంలో చేరిన కొత్తల్లో మా బంధువులొకింటికి వెళ్ళేవాణ్ణి. నన్ను చూడగానే ఆ

మహాతల్లి ఇలా అడిగేది:


"ఏమిరా నీ జీతం ఎంత?"


"500"

"మా వాడిది 600 లే!"


నేను నా జీతం ఎంత పొడిగించి చెప్పినా ఆవిడ వాళ్ళ అబ్బాయిది ఇంకొంచెం

పొడిగించి చెప్పేది.


నేను ఐఐటీ ఖరగ్పూరు లోచేరిన కొత్తల్లో టీచెర్ల హాస్టల్లో ఉండేవాణ్ణి. నాతో పాటు నా

మిత్రుడొకడుండే వాడు.ఆ హాస్టలు మేనేజరు పేరు రాజన్. మాకన్నా పదిపదిహేనేళ్ళు

పెద్దవాడు. చాలా మంచి వ్యక్తి. కపటం తెలియదు. అందరికీ బాగా సాయం చేసేవాడు.

నా మిత్రుడు నా వయసువాడే. కాని నాకన్నా ఎప్పుడూ అన్ని రంగాలలో మున్ముందుగా

ఉండేవాడు.


నా మిత్రుడు అసిస్టెంటు ప్రొఫెసరు అవగానే రాజన్ నా దగ్గరకు వచ్చి పబ్లికుగా ఇలా

అనే వాడు:


"హలో! నీ మిత్రునికి ప్రమోషన్ వచ్చింది. మరి నీకెప్పుడొస్తుంది?"


కొన్నేళ్ళ తర్వాత నేను సంతోషంగా ఇలా అన్నాను రాజన్ తో:


"హలో సార్! నేను ఈరోజు అసిస్టెంటు ప్రొఫెసరు అయ్యాను!"


"ఓ! అదేం గొప్పా! నీ మిత్రుడు ఎప్పుడో ప్రొఫెసరు అయిపోయాడుగా!"



మరికొన్ని సంవత్సరాల తర్వాత రాజన్ నాతో ఇలా అన్నాడు:


"హలో! నీ మిత్రుడు ఈరోజు తన పెళ్ళి పత్రికలు పంచాడు. మరి నువ్వెప్పుడిస్తావ్!"


ఆ తర్వాత ఒకరోజు నేను సంబరంగా నా పెళ్ళి పత్రిక రాజన్ కిచ్చినపుడు:


"ఇంత లేటు గానా? నీ మిత్రుడు తండ్రై అయిదేళ్ళవుతోందిగా!"


ఈ తతంగం చాలా దశాబ్దాలు నడిచింది. నేనూ నా మిత్రుడూ దాదాపు ఒకే సారి రిటైరై

హైదరాబాదు లో స్థిరపడ్డాము. అప్పటికి రాజన్ చాలా ఏళ్ళ క్రితమే రిటైరై ఎక్కడికో

వెళ్ళిపోయాడు.


ఒక రోజు ఎందుకో నాకు రాజన్ గుర్తొచ్చాడు. నవ్వుకున్నాను. 


ఆ రాత్రి నాకు ఒక కల వచ్చింది. నేను సడన్ గా స్వర్గస్థుడనయ్యానట. స్వర్గం చేరగానే

నేను రాజన్ ను వెదుకుతుండే వాణ్ణి. ఎక్కడా కనిపించక పోతే పక్కవాణ్ణి అడిగాను:


"ఇక్కడొక రాజన్ అనే వ్యక్తి ఉండాలి. ఎక్కడికెళ్ళాడు?"



"ఓ! ఆయనా! మిమ్మల్ని చూడగానే పరుగుపెట్టి ఇప్పుడే వస్తానంటూ భూలోకం

వెళ్ళాడు. అడుగో! క్రింద చూడండి దివ్యదృష్టితో!"


అలాగే నేను భూలోకానికేసి చూసాను. రాజన్ నా మిత్రునివద్దకు వెళ్ళి ఇలా

అంటున్నాడు:


"ఛీ! ఛీ! ఛీ! మీరింకా ఇక్కడే తారట్లాడుతున్నారా సార్! మీ మిత్రుడు ఎప్పుడో స్వర్గం చేరి

రంభా,  ఊర్వశీ, మేనకా, తిలోత్తమాలతో సరసారాలాడుచున్నాడు. మొత్తానికి ఈ

కుందేలు తాబేలు పందెం లో తాబేలే గెలిచింది! హాహాహాహాహా!"










...Posted by Ishani

**************************************************************************************************************************************

Monday, June 13, 2016

నేపధ్యంలో పథ్యం

***************************************************************************************************************************



ఇది మా అమ్మమ్మ కథ. ఈకథలో ఆమే హీరోయిను.


గత శతాబ్దం వృత్తాంతాలు.


నా అంచనా ప్రకారం అమ్మమ్మ జన్మ 1905 లో. ఆ కాలం లో తెలుగు సంవత్సరాలూ

తెలుగు తిథులూ…ప్రభవ విభవ లాటివి. ఆ అరవై మేము వల్లించే వాళ్ళం.
  
మామనవరాలికివేవీ తెలీవు. ఆమె మమ్మీ డాడీ జాకూ జిల్లూ తరం.


నాకు ఊహ తెలిసే సరికి 1950 లో అమ్మమ్మ తో తొలి పరిచయం. మహా ఠీవి మనిషి.

దొరలప్రభుత్వం లో మా తాత గారు రెవిన్యూ ఆఫీసరు. అమ్మమ్మ ద్వారా వినిన 

పదాలు: ఇఛ్ఛాపురం, బరంపురం,  ఛత్రపురం, విశాఖపట్నం, గోదావరి, పాపికొండలు,

 చిరుతపులులూ, కాటన్ దొర, వడ్డాణ్యం, లక్ష్మీకాసులూ, చామంతి బిళ్ళ, చంద్రహారం,

నాగరం, మొగలి దండలూ. ఇవన్నీనాకు విచిత్రంగా ఉండేవి.


ఆమె పసిడి వన్నె ఎడంచేతి మీద నల్లగా నీలంగా ఉండే ఒక తేలు బొమ్మను చూసి

అదేమిటి అని అడిగాను. పచ్చ అని చెప్పింది. ఎందుకు అన్నాను. అది ఫ్యాషను

అంది. ఎలా అన్నాను. సూదులతో పొడిపించుకున్నానంది. నేను మరి రెండు రోజులు

మాట్లాడలేదు. భయం వేసింది…అమెనూ ఆమె పచ్చనూ చూసి. పచ్చల ఫ్యాషను

మారిందనుకుంటా. మా అమ్మ కాని నా భార్య కాని పచ్చలు పొడిపించుకోలేదు. ఈరోజు

మళ్ళీ మా మనవరాలు పురమాయించింది: 


'తాతా  పాముల ట్యాటూలు మూడు కొనుక్కొరా' 



ప్రతి వేసంగి శలవల్లో అమ్మమ్మ మా ముత్తుకూరు వచ్చేది. ఆమె ఉన్న నెలసరి మాకు

ప్రతిరోజూ పండుగ. తెల్లవారి లేచి వేడి వేడి అన్నం వండి గిన్నె పక్కన పెట్టుకొని మా

ఆరుగురు పిల్లల్నీ అర్ధవృత్తాకారంగా ఆమె చుట్టూ కూచోబెట్టి చేతులు జాపించి ముద్దలు

చేసి పెట్టేది. అన్నంతో పాటు ఆవకాయో ఉల్లికారమో. దండిగా నెయ్యి. ఆమె చేసిన

పెద్దపెద్ద ముద్దలను ‘అమ్మమ్మ ముద్దలు’ అనేవాళ్ళం. పేకాటలో ముక్కల్లాగా ఆరు

చేతుల్లో ముద్దలు గబగబా పంచేది. మళ్ళీ మావంతు వచ్చేసరికి చెయ్యి ఖాళీగా

ఉండాలి. అదీ పందెం. ఐదు ముద్దలతో మాపని అయిపోయేది. ఇక లేచి పరుగులే. మళ్ళీ

మధ్యాన్నం వరకూ ఆటలే.


అమ్మమ్మ ఎవరింటికి వెళ్ళినా వాళ్ళ వంటగదిని ఆక్రమించి కూతుళ్ళకూ కోడళ్ళకూ

కూరలు తరిగే పని మాత్రం ఒప్పచెప్పేది. ఉప్పూ కారం ఆధిపత్యం తనదే.


పదేళ్ళ తర్వాత నేను యూనివర్సిటీ చదువుల కోసం విశాఖపట్నంలో మా మేనమామ

గారింట్లో చేరాను. అప్పుడు అమ్మమ్మ అక్కడ సామ్రాజ్యం చేస్తూ ఉండేది కొన్నాళ్ళు.

ప్రతి రోజూ ఉదయం ఎనిమిదిమ్ముప్పావు కాగానే కంచం పట్టుకొని వంటింట్లో నేలమీద

తిష్ఠవేసేవాణ్ణి. తొమ్మిదింపావు బస్సు అందుకోడానికి. అది మిస్సయితే నాలుగు మైళ్ళు

నడిచి వెళ్ళాలి. అందుకని.


అమ్మమ్మ అప్పటికే పరుగులు పెడుతూ వంటలో నిమగ్నం అయేది. వరుసగా

అవుతున్న సాధకాలు కూర, పులుసు, నా కంచంలో వడ్డించేది. నేను గబగబా

గతుకుతూంటే రోజూ అడిగేది:


“ఉప్పూ కారం సరిపోయాయా?”


“బ్రహ్మాండంగా ఉన్నాయి”


“ఏమో రోజూ అట్లే అంటావు. నీకు రుచీ పచీ తెలిస్తేనా. దిగమింగడం తప్ప”


పరుగులు పెట్టే నాకు రుచులు చూసే తీరిక ఎక్కడుండె.


రోజూ ఆమె వ్యాఖ్యలు భరించలేక ఒక రోజు నిజం చెప్పాను:


“కూరలో కొంచెం ఉప్పు ఎక్కువైంది”


“ఉప్పెక్కువైందా! నీ మొహం! మీ గుఱ్ఱం వాళ్ళకి ఉడకేసిన గుగ్గిళ్ళు తప్ప మరేమీ

నచ్చవు. ఉప్పు ఎక్కువట! ఉప్పు లేని కూడు చప్పగుండదా?  తిక్కలోడా!”


అదీ ఆమె తంతు. నోరు మూసినా తప్పే నోరు తెరిచినా తప్పే! కానీ నిజం చెప్పాలంటే

అమ్మమ్మ వంటలు అద్భుతంగా ఉండేవి...ఉప్పు తప్ప.


మరో పదేళ్ళ తరువాత అమ్మమ్మా తాతగారూ నెల్లూరులో వాళ్ళ స్వగృహంలో

స్థిరపడ్డారు. ఆపైన రోజూ మనవళ్ళూ మనవరాళ్ళ తో పదికి తక్కువ లేకుండా విస్తళ్ళు

లేచేవి అమ్మమ్మింట్లో.


ఒకరోజు ఆమె కుమారుడు (అదే మా డాక్టరు మేనమామ) విశాఖపట్నం నుంచి వస్తూ

సరికొత్త బీపీ యంత్రం తెచ్చి అందరికీ బీపీ చూడడం ఆరంభించాడు. అమ్మమ్మ వంతు

రాగానే ఆశ్చర్య పోయాడు. 220/150. నాలుగు సార్లు చెక్ చేసిన తర్వాత ఇలా

అన్నాడు:


"అమ్మా! ఇక నువ్వు ఉప్పు పూర్తిగా మానెయ్యాలి. లేకపోతే పక్షవాతంతో మంచం పడతావు.

నీవంటలు కట్టిపెట్టి వంటమనిషిని పట్టుకో!”


ఆబెదిరింపుకు నవ్వి ఆమె సరేలే నీ ఇష్టం అంది. మరు సంవత్సరం నేను అమ్మమ్మ

ఇంటికి వచ్చినప్పటికి ఆమెకు నచ్చిన వంట మనిషి ఉండేది. ఆమె వంటమనిషికి

అందరూ వినేట్లుగా ఇలా గట్టిగా పబ్లికుగా పురమాయించేది:


"సీతమ్మా! ఉప్పు పూర్తిగా తగ్గించి వెయ్యి. ఉప్పెక్కువ తింటే రుచి కమ్మగుంటుంది కానీ

పక్షవాతం వస్తుంది"


అని నాలుగు సార్లు గుర్తు చేసేది. ఇక ఆ చప్పటి వంట మాపరం అయేది. తప్పదు కాబట్టి

మేం గుట్టుగా తినే వాళ్లం. ఒకరోజు మా అమ్మతో నేనిలా అన్నాను:


"అమ్మమ్మ నిజంగా చాలా మారింది. ఆరోగ్యం ఐశ్వర్యం అని గ్రహించింది"


అప్పుడామె ఫక్కున నవ్వి ఇలా అంది:


"ఓహో! ఆమె సంగతి నీకు తెలీదులే. పిల్లలూ తల్లులూ అందరి భోజనం

అయింతర్వాత ఆమె, సీతమ్మా ఎదురెదురుగా వంటింట్లో కంచాలు పెట్టుకొని కబుర్లు

చెప్పుకుంటూ 'ఛీ ఉప్పు లేని కూడు తినేదెలా...ఆ ఉప్పు డబ్బా ఇటుతే' అనుకుంటూ

చెరో పిడికెడు ఉప్పు కంచంలో వేసుకునే వాళ్ళు"


అదీ మా అమ్మమ్మ పథ్యం!


అలా ఇంకో పదేళ్ళు గడిపి ఏజబ్బూ లేకుండా భర్తకు సేవజేసి సాగనంపి మంచాన

పడకుండా ఒక రోజు స్వర్గం చేరుకుంది.


మరి ఈకాలం ఆమె మునిమనవళ్ళు ముప్ఫై నిండకుండా సుగరూ బీపీ అసిడిటీ

కొలెస్టరాలూ లివరూ హార్టూ అనుకుంటూ ఆరు నెలలకొక సారి స్కానులు

చేయించుకుంటూ పథ్యం చేస్తూ బాధలు పడుతున్నారుగా!


అమ్మమ్మలు జిందాబాద్!











...Posted by Ishani

***********************************************************************************************************************