Sunday, August 12, 2018

శంకరార్పణం - 2761

****************************************************************************************



శంకరాభరణం సమస్య - 2761

"దాహ మైనప్పుడే బావిఁ ద్రవ్వఁ దగును"


కప్పి యున్నది మాయతో కలన జలము 

కామ దాహము తెలియదు కందులకును 

మోహము మదము తీరగ మురిసి...జ్ఞాన 

దాహ మైనప్పుడే బావిఁ ద్రవ్వఁ దగును



కలన = జ్ఞానము





"దాహము వేసినప్పుడె కదా నుయిఁ ద్రవ్వఁగ నొప్పు జ్ఞానికిన్"


దాహము వేసినప్పుడె కదా నుయిఁ ద్రవ్వఁగ నొప్పు జ్ఞానికి

న్నాహము నాహమున్ననుచు  నమ్ముచు దేహము మట్టిబొమ్మ గా
 
కోహము కోహమున్ననుచు కోరిక తీరగ దేవులాడగా 

సోహము సోహమే ననుచు సొంపుగ నింపుగ నర్థమౌనహా!





(కంది శంకరయ్య గారి సౌజన్యంతో)


*******************************************************************************************

No comments: