*************************************************************************************************************
శంకరాభరణం సమస్య - 3135
"కుజనుల్ క్రూరమనస్కు లెల్లరు గదా గుంటూరు వాసుల్ గనన్"
(మొన్న శ్రీకాకుళం వెళ్తున్నపుడు రైలు గుంటూరు స్టేషనులో ఆగినప్పుడు సిద్ధమైన
సమస్య. గోలి హనుమచ్ఛాస్త్రి గారు, బొగ్గరం ప్రసాద రావు గారు తదితర
గుంటూరు మిత్రులు క్షమిస్తారని ఆశిస్తూ...)
(hot-hot news)
కమల్ హాసన్ ఉవాచ:
ధ్వజముల్ చేకొని కావిరంగులవి భల్ ధైర్యమ్ము వైరమ్ముతో
భజనల్ చేయుచు "హింది-హింది" యనుచున్ భాగించి రెచ్చించెడిన్
కుజనుల్ క్రూరమనస్కు లెల్లరు గదా;....గుంటూరు వాసుల్ గనన్
సుజనుల్ కారపు నావకాయ తినుచున్ శోభిల్లు శృంగారులే!
కుజనుల్ = అమిత్ షా భక్తులు
(కంది శంకరయ్య గారి సౌజన్యంతో)
****************************************************************************************************************************************************
No comments:
Post a Comment