***************************************************************************************************
శంకరాభరణం పద్య రచన - 1151
“సిరిగలవానికిఁ జెల్లును
దరుణులఁ బదియారువేలఁ దగఁ బెండ్లాడన్,
దిరిపెమున కిద్దరాండ్రా?
పరమేశా గంగ విడుము పార్వతి చాలున్.
ఈ శ్రీనాథుని చాటువును అన్యచ్ఛందంలో చెప్పండి.
అరెవో శంకర! శ్రీకరుండు కొనగన్ హ్లాదంపు వే భార్యలన్
పరవా లేదుర! వాని బొక్కసమునన్ బంగారమే పండురా!
సరియౌ తిండియు లేని భిక్షువుర! నీ సంసారమందేలరా?
వరమౌ నిర్వురు భార్యలే! విడువుమా బంగారు గంగమ్మనున్
కరముల్ మోడ్చెద! పార్వతమ్మ నికపై గారాబుగా హత్తుమా!
😊
(కంది శంకరయ్య గారి సౌజన్యంతో)
*********************************************************************************************************************************************
No comments:
Post a Comment