Saturday, August 11, 2018

శంకరార్పణం - 2760

*********************************************************************************


శంకరాభరణం సమస్య - 2760

"శ్రీకృష్ణునిఁ దిట్టె నయొ కుచేలుం డలుకన్"



పోకిరి చంద్రుడు రాముని 

చీకాకులు పెట్టిపెట్టి చిడిముడి జేసెన్...

కాకా! ఇదియెట్లన్నన్: 

శ్రీకృష్ణునిఁ దిట్టె నయొ కుచేలుం డలుకన్ :)


********************************************************************************************



"శ్రీకృష్ణుం గటుభాషణంబులను గర్హించెన్ గుచేలుం డయో"




ఆకాశంబున నుండి వ్రాలె గదరా! హైరాణ గావించితే!

కోకల్ నూలువి పట్టువస్త్రములు హా! కోటానుకోటుల్ గ! నన్

చీకాకున్ పడజేసి నాకు చెమటల్ చిందించితే! యంచు పల్
 
శ్రీకృష్ణుం గటుభాషణంబులను గర్హించెన్ గుచేలుం డయో :)



కుచేలుడు = చీరలను లాగి లాగి సొమ్మసిలి చెమటతో తడిసి చినిగిన వస్త్రములు కల దుశ్శాసనుడు 

కుచేలము: తెలుగు నిఘంటువు 
తెలుగు-తెలుగు (జి.ఎన్.రెడ్డి-ఆం.ప్ర.సా.అ.) 1979    
సంస్కృత విశేష్యము

చినిగిన వస్త్రము.










(కంది శంకరయ్య గారి సౌజన్యంతో)


*************************************************************************************

No comments: