*******************************************************************************************************
శంకరాభరణం సమస్య - 3579
"సకల సుఖాలవాలము శ్మశానమె యందురు పండితోత్తముల్”
అపరకర్మలు చేయు పురోహితులు 10, 11, 12, అంత్యక్రియలు జరుపుటకు మా ఎర్రగడ్డ శ్మశానవాటికలో ప్రత్యేక మండపమున్నది :)
నకనక లాడి బంధువులు నందము వీడుచు కర్మకాండకున్
వికలపు మానసమ్మునను విత్తము గూర్చగ నప్పుజేయుచున్
చకచక దుడ్డు లాగుటకు శాస్త్రుల వారికి యెర్రగడ్డనున్
సకల సుఖాలవాలము శ్మశానమె యందురు పండితోత్తముల్...
(కంది శంకరయ్య గారి సౌజన్యంతో)
***************************************************************************************************
No comments:
Post a Comment