Wednesday, November 27, 2019

శంకరార్పణం - 1141

******************************************************************************************************

Image result for rahul gandhi embracing and winking




శంకరాభరణం పద్య రచన - 1141




“ఊరక సజ్జనుం డొదిగియుండిననైన దురాత్మకుండు ని

ష్కారణ మోర్వలేక యపకారముచేయుట వాని విధ్యగా

చీరలు నూఱుటంకములు చేసెడివైనను బెట్టె నుండగాఁ

జేరి చినింగిపోఁ గొఱుకు చిమ్మట కేమి ఫలంబు భాస్కరా”




పై పద్యభావాన్ని మీకు నచ్చిన ఛందంలో చెప్పండి.












ఉపమాన సహిత రాద్ధాంతము:



దూరుచు మోడి హైందవుల తోరపు హృత్తులు హర్షమొందగా 

కోరికలెల్ల తీర్చుచును కొండొక రీతిని సేవజేయగా

పోరుచు నట్టి భద్రుడను పోకిరి తీరున కౌగిలించుచున్

భారిగ కన్నుగొట్టెడివి వంకర చేష్టలు మాను రాహులా!

😊














(కంది శంకరయ్య గారి సౌజన్యంతో)


***********************************************************************************************************************************************

No comments: