*************************************************
శంకరాభరణం సమస్య - 3515
"మొలలోఁ గత్తిని దూసి ఱేఁడు పొడిచెన్ మోదంబునన్ దత్సతిన్"
Bollywood Othello:
కులమున్ గోత్రము నెంచకే విడుచుచున్ ఘోరంబుగా సిగ్గునున్
తలనున్ వాల్చుచు హృత్తునన్ నగవుచున్ తాదాత్మ్యమున్ జెందుచున్
విలనున్ ప్రీతిని కౌగిలించగనయో బీభత్సమున్ జేయుచున్
మొలలోఁ గత్తిని దూసి ఱేఁడు పొడిచెన్ మోదంబునన్ దత్సతిన్
(కంది శంకరయ్య గారి సౌజన్యంతో)
No comments:
Post a Comment