Friday, October 23, 2020

సరదా శంకరాభరణం

 ******************************************************************************************************


సరదా శంకరాభరణం:


భరణమ్మించుక కోరకే వడివడిన్ పద్యమ్ములన్ వ్రాయుటన్

కరుణన్ నేర్పగ కంది శంకరులహో గాఢమ్ముగా ప్రేమనున్

తరుణమ్మిప్పుడె చేరుడీ తనరుచున్ తాదాత్మ్యమున్ జెందగా

శరణం పండిత మానసాపహరణం శశ్వద్యశఃకారణం....







హరణం పాపములన్నిటిన్ హృదయమున్  హైరాణనున్ జేసెడిన్

మరణాద్పూర్వము గ్రోలగన్ సుఖదదౌ మాహాత్మ్యమున్ శీఘ్రమున్

చరణం స్వర్గపు ధామమున్ చెలగుచున్ శాస్త్రీయమౌ పద్ధతిన్

శరణం పండిత మానసాపహరణం శశ్వద్యశఃకారణం....






కరణమ్ముల్ మరి బ్రాహ్మణుల్ హరిజనుల్ కాయస్థులున్ వర్తకుల్

హరిణమ్ముల్ మరి వ్యాఘ్రముల్ గజములున్ హ్లాదమ్ముగా నశ్వముల్

ధరణీపాలురు మంత్రులున్ భటులునున్ ధర్మాత్ములున్ కూడగన్

శరణం పండిత మానసాపహరణం శశ్వద్యశఃకారణం...





*****************************************************************************************************

No comments: