**********************************************************************************************************************************************
మా చిన్నప్పుడు దేశోధ్ధారక కాశీనాధుని నాగేశ్వర రావు గారు (అమృతాంజనం
పంతులు) స్థాపించిన మాస పత్రిక 'భారతి' చాలా గొప్పగా ఉండేది.
అందులో శ్రీ మధురాంతకం రాజారాం గారి కథలు అద్భుతంగా ఉండేవి. ఆయన
వ్రాసిన ఒక కథ 'చేదు నిజం' అరవై ఏళ్ళ తర్వాత కూడా ఇప్పటికీ నాకు బాగా జ్ఞాపకం.
ఆ కథ గురించి వేరేగా ఎప్పుడైనా రాస్తాను.
ఈరోజు నా బాల్యం లో నాకు జరిగిన ఒక చేదు నిజం కథ చెబుతాను:
1953:
ముత్తుకూరు హై స్కూలులో మాడో ఫారం చదువుతుండేవాణ్ణి. వయసు పదేళ్ళు. శెలవు వస్తే చాలు ఖాఖీ చెడ్దీ తెల్ల డ్రిల్ చొక్కా తగిలించి ఊళ్ళో ఉన్న ఒకే ఒక రోడ్డులో బోడి సైకిల్ టైరు చేతిలో కర్రపుల్ల తో తోసుకుంటూ పరుగులుపెట్టడం ఆనవాయితీ.
మా నాన్నగారు మా స్కూలు హెడ్మాస్టరు.
ఒక ఉదయం అలా పరుగులు తీస్తుంటే రోడ్డు పక్కన ఉన్న ఒకే ఒక టైలరు షాపు నుంచి కేక వినిపించింది:
"అబ్బాయి! అబ్బాయి! ఒక సారి ఇలా రా!"
ఏమైందోనని టైరు కిందపడేసి వెళ్ళాను. ఎప్పుడూ చూడని ఒక రెడ్డి గారు కూచొని ఉన్నారు. స్టూలు మీద. సిలుకు జిబ్బా. సిలుకు పంచె. చేతికున్న వేళ్ళల్లో అన్నిటికీ ఉంగరాలు. మెడలో బంగరు దండ. చేతిలో సిగరెట్టూ.
నన్ను చూసి రెడ్డిగారు చిన్న చిరునవ్వొకటి బహూకరించారు. ఇంతలో మా టైలరు నన్ను తన ఎదురుగా నిలబెట్టి షర్టుకూ ప్యాంటుకూ చకచకా కొలతలు తీసి చెవిలో పెనిసిలు తీసి పుస్తకం లో రాసుకున్నాడు. తరువాత ఇక పో అన్నట్టు సైగ చేశాడు. రెడ్డి గారు మరో చిరునవ్వు ఒలికించాడు.
సైకిలు టైరు తోసుకుంటూ పరుగులు తీస్తూ ఆలోచనల్లో పడ్డాను.
మరునాటినుంచీ రోజూ రోడ్డు మీద పరుగులు తీస్తున్నప్పుడల్లా టైలరు కేసి చూసేవాణ్ణి. నా కొత్త బట్టల బహుమతి ఎప్పుడిస్తాడా అని. ఆశగా.
ఇలా ఒక నెల గడిచింది.
ఇక ఆగలేక ఒక రోజు టైలరు షాపు లో దూరి తనని అడిగాను:
"ఆ రోజు రెడ్డి గారు నా కొలతలు తీయించినాడే...ఆ బట్టలు రెడీ అయ్యాయా?"
"ఆ! ఎప్పుడో రెడీ! ఆ ఈపూరు రెడ్డిగారు అర్జంటుగా కావాలంటే మూడో రోజే ఇచ్చేశాను. ఆయన చిన్న కొడుకు జన్మదినానికి ఆయన కుట్టించి ఇచ్చిన సీక్రెటు గిఫ్టట సిలుకు డ్రెస్సు. వాళ్ళబ్బాయి కరెక్టుగా నీ సైజే ఉంటాడట. అందుకని చూసి చూసి నిన్ను పిలిపించాడు ఆ రోజు."
...Posted by Ishani
***********************************************************************************************************************************************

No comments:
Post a Comment