************************************************************************************************************************************
1995- IIT Kharagpur - Qrs B-140
అప్పుడు నా వయసు 52. అప్పటికే 30 ఏళ్ళ సర్వీసు. లంకంత కొంపలో నేనూ, నా భార్యా, మా 14 ఏళ్ళ అబ్బాయి సుఖంగా కాలం గడుపుచూ ఉండేవాళ్ళం.
ఒక రోజు రోడ్డుకు ఎదురుగా ఉన్న క్వార్టర్స్ లో నూత్న దంపతులు చేరారు. చక్కగా చిలకా గోరింకల్లా ఉన్న వాళ్ళిద్దరినా చూస్తుంటే మాకు చాలా సంతోషం కలిగింది. పైగా చూడబోతే అచ్చు తెలుగు దంపతుల్లా ఉన్నారు.
మర్నాడు సాయంత్రం బెల్లు మోగి తలుపుతీయగానే ఆ దంపతులే. లోపలికి ఆహ్వానించి కబుర్లూ కాకరకాయల్లో పడ్డాము హ్యాపీగా.
అమ్మాయి పేరు సీత. ఆమె చెప్పింది: తన అన్నగారు 'హనూ' 25 ఏళ్ళక్రితం మా స్టూడెంటట. ప్రస్తుతం ఢిల్లీలో మినిస్ట్రీలో సెక్రటరీ. బావా చెల్లాయి తో అన్నాడట: మీరు ఖరగ్పూరు చేరగానే జీ పీ శాస్త్రి గారనే ఫిజిక్సు టీచర్ని కలవండి. మా ఫేవరిట్ టీచరు. అని.
"అందుకే మిమ్మల్ని కలవడానికి వచ్చాము. మీకు హనూ గుర్తున్నాడా?"
"ఓ! చాలా బాగా గుర్తున్నాడు. ఇన్నేళ్ళ సర్వీసు లో తనొక్కడే హనూ"
చిన్ననాటి రోజులు గుర్తొచ్చి నేను చాలా సంబరపడ్డాను. అతిత్వరలోనే సీత గారు నా భార్యకు సన్నిహితం అయ్యారు. సీత గారిని మా ఆవిడ తన కూతురులాగే భావించేది. పండుగలూ పర్వాలూ పిండివంటలూ పూజలూ పునస్కారాలూ జాయింటుగా జరిగేవి.
ఆర్నెల్ల తర్వాత సీత గారు ఢిల్లీ వెళ్ళి వారం రోజుల తర్వాత తిరిగి వచ్చారు. ఆరోజే మాఇంటికి ఆలూమగలూ వచ్చారు. రాగానే సీత గారు నాతో ఇట్లన్నారు:
"మేము ఢిల్లీలో ఇల్లు చేరగానే హనూ నన్నడిగాడు. జీ పీ శాస్త్రి గారింటికి వెళ్ళారా అని. వెళ్ళాము చాలా సార్లే. ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయిపోయాము. అని. చాలా సంతోషించి అడిగాడు: సన్నగా బక్కగా ఉంటారు కదా అని. నేను అదేమీలేదే అన్నాను. క్లాసుకు వచ్చేముందూ క్లాసు అయ్యాకా సిగరెట్టు పీల్చేవారు. నిత్యాగ్నిహోత్రులు కదా అన్నాడు. అబ్బే! లేదు...మేమున్న గంటలు గంటల్లో ఒక్క సారి కూడా పొగ పీల్చలేదే. అప్పుడన్నాడు: ఆయన ఆజన్మబ్రహ్మచారి కదా...ఎప్పుడూ హాస్టల్లో ఉండేరకం కదా. అని...అదేమీ లేదు. చక్కటి భార్యా ముచ్చటి కొడుకూ అన్నాను. హనూ ఒక నిమిషం ఆలోచించి అన్నాడు: మీరు చూసింది మాటీచర్ శాస్త్రిగారిని కాదు...వేరే ఎవరినో. అని."
అలా అని సీత గారు నన్నడిగారు:
"చిన్నప్పుడు మీరు బక్కపీచుల్లా ఉండేవారా సార్?"
"అవును..."
"చైన్ స్మోకరా?"
"అవునవునవును..........."
"ఆజన్మ బ్రహ్మచారా?'
"అవునవునవునవునవును...................................."
...Posted by Ishani
*************************************************************************************************************************************

No comments:
Post a Comment